డిసెంబర్ వరకూ పిసిసి అధ్యక్షుడిగా శీనన్నే

తనను పిసిసి చీఫ్ గా తప్పించాలని డిఎస్ సోనియా గాంధీకి విజ్ఞప్తి చేసినప్పటికీ డిసెంబర్ వరకు కొనసాగాలని ఆమె సూచించినట్లు సమాచారం. డిఎస్ కొనసాగాలని తెలంగాణ నాయకులే కాకుండా సీమాంధ్ర నాయకులు కూడా కోరుకుంటున్నారు. డిఎస్ ను కొనసాగించాలనే నిర్ణయం వెనక అది ఒక కారణమని అంటున్నారు. అంతేకాకుండా, రాష్ట్ర పరిస్థితిపై వేసిన శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ చివరలో తన నివేదికను సమర్పించనుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికను బట్టి రాష్ట్ర నాయకత్వంలో మార్పు చేయాలనే ఆలోచన ఆధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తన నివేదికను సమర్పిస్తే ఒక రకంగా, వ్యతిరేకంగా సమర్పిస్తే మరో రకంగా నాయకత్వ మార్పు చేయాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా, రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని, దానిపై కచ్చితమైన తమ నిర్ణయాన్ని మరోసారి వెల్లడించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన తర్వాత పిసిసి మార్పు చేయాలని కూడా అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications