రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, జలాశయాలు కళకళ

Heavy Rains
హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కర్ణాటకతో పాటు రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వానలతో కృష్ణా, తుంగభద్రలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుండడంతో బుధవారం రాత్రి శ్రీశైలం గేట్లు ఎత్తేశారు. 4.02లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా నాలుగు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌లోకి 1.04లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక్కడి రెండు విద్యుత్‌ కేంద్రాల నుంచి అదనంగా 75వేల క్యూసెక్కులు కూడా దిగువకు వదులుతున్నారు. భారీఎత్తున వరద వచ్చి చేరుతుండడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. గత ఏడాది వరద మిగిల్చిన చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చి కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కృష్ణా, తుంగభద్ర తీర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆలమట్టి, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల తక్కువగా ఉన్నా దిగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్‌లోకి భారీగా వరద వస్తోంది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం జుక్కల్‌ఎర్రకుంటలో వర్షంతో 40 ఇళ్లు నీటమునిగాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 40 ఇళ్లల్లోని స్థానికులను జుక్కల్‌ ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాలలో ఇంటిపైకప్పు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వర్షాలకు ఇల్లు నానడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. చిన్నారుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, మహబూబ్ నగర్ జిల్లా ఐజలో వరదల్లో ఓ కారు, బైక్ కొట్టుకుపోయాయి. ఓ వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని పలు కాలనీలు నీటిలో మునిగాయి. హైటెక్ సిటీ నుంచి పంజగుట్ట వరకు రోడ్లు నీటిలో మునిగిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోసాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. నిన్నటి నుంచి ఇప్పటివరకు అత్యధికంగా బాపట్లలో 11సెం.మీ., నర్సాపురంలో 6 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. అల్పపీడన ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 45 - 50 కి.మీ. వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+