ఇద్దరు భార్యలు ఉంటే ఇక అంతే సంగతులు: సీఎం సంచలన ప్రకటన

ఇద్దరు భార్యలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక ప్రకటన చేశారు. ఒకరికి మించి భార్యలు ఉంటే అతన్ని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగిస్తామని సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు భార్యలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక ఆదేశాలు జారీ చేశారు. బహుభార్యత్వం విధానంపై తమ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో అసోం ఆర్థిక మంత్రి జయంత మళ్లబరువా కూడా పాల్గొన్నారు.

ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు భార్యలను కలిగి ఉంటారో వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. వారిని ఉద్యోగం నుంచి తొలగింపు ఉంటుందని పేర్కొన్నారు. బహుభార్యత్వం, నేరస్థులపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలాగే ప్రస్తుతం ఆగిపోయిన ప్రభుత్వ పథకాలు ఈ ఏడాది ఆగస్టు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయని అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కారణంగా పథకాలు నిలిచిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని అన్నారు. అందుకోసం ఇప్పుడున్న ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా కొత్త పోస్టులను కూడా సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Assam Chief Minister Himanta Biswa Sarma a major shock awaits government employees with two wives

" చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తాం. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1.15 ఉద్యోగ ఖాళీలను గుర్తించాం. కానీ మేము 2 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని అనుకుంటున్నాం. దానికోసం కొత్త పోస్టులను క్రియేట్ చేస్తాం. ఈ మేరకు రెవెన్యూ, ఎడ్యూకేషన్, హెల్త్ డిపార్ట్ మెంట్స్ లో పోస్టులను గుర్తిస్తాం" అని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. మరోవైపు అసోం ఆర్థిక మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించడంపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళా సాధికారత, లింగ సమానత్వం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే బహుభార్యత్వం విధానాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+