వైయస్ జగన్ వెంట 27 మంది ఎమ్మెల్యేలు: గవర్నర్ నివేదిక

Narasimhan
న్యూఢిల్లీ: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట 27 మంది శాసనసభ్యులున్నట్లు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివేదిక అందించారని సమాచారం. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు గవర్నర్ నరసింహన్ గురువారం హుటాహుటిన బయలుదేరి వచ్చారు. వైయస్ జగన్ వ్యవహారంపై, రాష్ట్ర విభజనపై ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం పడిపోదని ఆయన స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ వెంట 28 మంది శాసనసభ్యులతో పాటు ముగ్గురు నలుగురు పార్లమెంటు సభ్యులున్నారని ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. జగన్ పై చర్యలు తీసుకోవడానికి బదులు మందలించి దారికి తెచ్చుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజనపై కూడా గవర్నర్ తన అభిప్రాయాన్ని నివేదికలో తెలిపినట్లు సమాచారం. రాష్ట్ర విభజన చేయాల్సి వస్తే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు నష్టవాటిల్లుతుందని హైదరాబాదులోని స్థానికేతరులు అభద్రతకు గురవుతున్నారని, అందువల్ల హైదరాబాదును కేంద్ర పాలితంగా చేయవచ్చునని ఆయన వివరించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+