మంత్రి వర్గంలో ఉండి సిఎం రోశయ్య పాలనపై విమర్వలు చేస్తూ...జగన్ ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ చేస్తున్న వారంతా రాజీనామాలు చేసి మాట్లాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి జగన్ వర్గీయుల పై ఫైర్ అయ్యారు. సోమవారం ఉదయం రోశయ్యను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలినేని లాంటి వారు మంత్రి వర్గంలో ఉండి ప్రబుత్వంపై, పార్టీ పై విమర్శలు చేయడం తగదని, మీకు మంత్రి పదవి అక్కర్లేకుంటే రాజీనామా చేసిన అలాంటి వ్యాఖ్యలు చేయాలని సూచించారు.