వ్యతిరేకులపై ఓదార్పు యాత్రలో ధ్వజమెత్తిన వైయస్ జగన్

వైయస్సార్ పై విమర్శలు చేస్తున్న నాయకులు జనాభిమాన ప్రవాహంలో కొట్టుకుపోతారని ఆయన అన్నారు. ప్రజల గుండెలు వైయస్సార్... వైయస్సార్...అంటూ కొట్టుకుంటున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ పై అభిమానంతో ప్రజలు తనను ఆదరిస్తున్నారని, ఆప్యాయత చూపుతున్నారని ఆయన అన్నారు. ఈనాడు రామోజీరావుపై నేరుగా విమర్శలు చేసిన జగన్ బుధవారంనాడు వైయస్సార్ పై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, ఇతర నాయకులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు.












Click it and Unblock the Notifications