చంద్రబాబు ది ముగిసింది..చిరంజీవిది మొదలైంది

మండల, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసేలా అధినేత పర్యటన ఉపయోగించుకోవాలని పీఆర్ పీ నాయకులు భావిస్తున్నారు. పార్టీలు, రాజకీయాలకతీతంగా చిరంజీవిని అభిమానించే యువతను పార్టీ వైపు ఆకర్షించేలా ప్రజా చైతన్యయాత్రను రూపొందించినట్లు వారు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుదు కల్యాణి, జిల్లా అధ్యక్షుడు పాలవలస కరుణాకర్‌లు ఆదివారం చిరంజీవి పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇక ఈ రోజు చిరంజీవి హైదరాబాద్ నుంచి నేరుగా ఇచ్ఛాపురం చేరుకోనున్నారు. రాత్రికి ఇచ్ఛాపురంలోనే బస చేస్తారు. మంగళవారం ఇచ్ఛాపురంలో ప్రజా చైతన్యయాత్ర ప్రారంభించి కవిటి, కాశీబుగ్గ, కాకరాపల్లి, పోలాకి మీదుగా రాత్రికి శ్రీకాకుళం చేరుకుంటారు.












Click it and Unblock the Notifications