వైయస్ జగన్ కి సపోర్టు చేసినందుకే వీరప్ప మొయిలీపై వేటు?

రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యతలను మొయిలీ స్థానంలో మరొకరికి అప్పగించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు మార్పులు జరగడం ఖాయమని, ఈ నెలాఖరుకు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్తున్నారు.
ఇక మొయిలీని మార్చేదాకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా ఊరుకోవాలని, అధిష్ఠానం ముందు కీలక నిర్ణయాల ప్రతిపాదనలేవీ పెట్టరాదని రోశయ్య తీర్మానించుకున్నట్లు తెలిసింది. కొత్త ఇన్ చార్జిని నియమించగానే రోశయ్య ఢిల్లీకి వెళ్లి...మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చర్చించనున్నారు. ఆ తర్వాత ఈ నెలాఖరుకు మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నారు. ఇందులో భాగంగా ఐదారుగురిపై వేటు వేయడంతోపాటు...కొత్త వారిని తీసుకొని సీనియర్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నం చేస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications