వైయస్ జగన్ ఆస్తులను హైకమాండ్ తెప్పించుకుంటోంది: పాల్వాయి

ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. కొత్త మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా తెలంగాణ పిసిసి ఏర్పాటు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రత్యేక పిసిసి అడగడంలో తప్పు లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ అన్నారు. అయితే, తుది నిర్ణయం మాత్రం హై కమాండ్ దేనని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications