ఎమ్మార్ ప్రాపర్టీస్ పై నెపం చంద్రబాబు మీదికి నెట్టిన అంబటి రాంబాబు

Ambati Rambabu
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై నెపాన్ని కాంగ్రెసు బహిష్కృత నేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్య అనుచరుడు అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపైకి నెట్టారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ ఒప్పందం 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం కోర్టుకెక్కిందని, కోర్టు తీర్పు వెలువడిన తర్వాత చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాన్ని తాము అమలు చేశామని ఆయన వివరించారు. మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆరోపణలు చేయడంలో కుట్ర దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మేం చేస్తే వ్యభిచారం మీరు చేస్తే శృంగారమా అని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నించారు.

కాంగ్రెసులోని వైయస్ వ్యతిరేక వర్గంతో కుమ్మక్కయి తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈనాడు దినపత్రికలో ఎమార్ ప్రాపర్టీస్ పై వచ్చిన వార్తాకథనాలను ఆయన తప్పు పట్టార. ఒక పత్రికలో వచ్చిన వార్తలను ప్రాతిపదికగా చేసుకుని డిమాండ్లు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎకరాలకు ఎకరాలు మింగితే తప్పు లేదు, తాము చేస్తే తప్పా అని ఆయన అడిగారు. వైయస్సార్ మరణం తర్వాత ఇన్నాళ్లకు ఆరోపణలు చేయడం దొంగలు పడిన ఆరు నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+