రవీంద్రనాథ్ రెడ్డి హరిత వద్ద బిజెపి ధర్నా: దాడికి దిగిన హరిత ఉద్యోగులు

Kadapa
హైదరాబాద్: అన్నదాతల ఎరువుల విషయంలో అక్రమాలకు పాల్పడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది, కడప మేయరు రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మాజీ ఆధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని దామరచెర్లలో ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి మిక్సింగ్ ప్లాంటు హరిత ఫెర్టిలైజర్స్ ఎదుట ధర్నా నిర్వహించారు. వైఎస్ హయాంలో ఆయన బంధువులు, అనుయాయులు వేల కోట్లు వెనకేసుకున్నారని దత్తాత్రేయ అరోపించారు. రైతులను, సామాన్యుల కడుపు కొట్టి దోచుకున్న డబ్బు పెట్టుబడులలో పెట్టి మళ్లీ మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య నాటి వైఎస్ లాగే అక్రమార్కుడైన రవీంద్రనాథ్ రెడ్డిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ కారణంగానే సచివాలయంలో రెండు రోజుల క్రితం ఆయనతో చర్యలు జరిపారన్నారు. వెంటనే రవీంద్రనాథ్ రెడ్డిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టులు, దాడులకు భయపడమని రవీంద్రనాథ్ రెడ్డి అక్రమాలు బయట పెట్టడానికే ఇక్కడకు వచ్చామని దత్తాత్తేయ పేర్కొన్నారు.

బిజెపి కార్యకర్తలు కంపెనీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించరు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన హరిత ఫెర్టిలైజర్స్ లో పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు ధర్నా చేస్తున్న బిజెపి కార్యకర్తలపై దాడి చేశారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఆక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మీడియాను కూడా ప్లాంట్ యజమానులు లోనికి అనుమతించటం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+