హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమార్ పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలి: డిఎల్ రవీంద్రారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: ఎమార్ సంస్థల అక్రమాలపై నిజాలు నిగ్గు తేలాలంటే వెంటనే సిబిఐ ఎంక్వయిరీ వేయాలని కాంగ్రెసు నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బిపి ఆచార్య, పార్థసారథిలను అక్రమాలకు ప్రేరేపించింది ఎవరో బహిర్గతం కావాల్సి ఉందన్నారు. ఎమార్ అక్రమాల పుట్ట వెనుక ఉన్న ఆ అదృశ్యశక్తులు ఎవరో బయటపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోని వస్తాయన్నారు. ఇప్పటికే ఒక ప్రముఖ దినపత్రిక ఎమార్-ఏపిఐఐసి కుంభకోణాలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తెచ్చిందని, అందులో ఆధారాలతో సహా బయట పెట్టారన్నారు.

సిబిఐ విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఈ అక్రమాలపై సిబిఐ ఎంక్వయిరీ కోసం ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడుతానని ఆయన తెలిపారు. ఎమార్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీఐఐసి గంగవరం ఎయిర్ పోర్టు భూముల వ్యవహారంలో 1.60 కోట్లు నష్టపోయిందన్నారు. ఇక్కడ ఎకరాకు 20 లక్షల రూపాయలు పలుకుతుంటే కేవలం 4 లక్షల రూపాయలకు మాత్రమే ఎకరా భూమిని ఎమార్ కు కేటాయించిందన్నారు. సోలిసిటర్ జనరల్, నిపుణుల నివేదిక ఆధారంగా ఆ భూమిని వెనక్కు తీసుకోవాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X