మన దేశం పరువు పోయింది: కామన్ వెల్త్ పై చంద్రబాబు

తాము ఏం చేసినా అడిగేవారు లేరని ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు. భద్రతా ఏర్పాట్లు కూడా సరిగా లేవని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు ఆయుధాలతో లోపలికి వెళ్లినా అడిగే వారు లేరని ఆయన అన్నారు. దేశం ఏమైనా ఫరవాలేదు తమకు డబ్బులు వస్తే చాలనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన అన్నారు. ఢిల్లీలో మరో వైపు ఉగ్రవాద చర్యలకు అవకాశం ఉందని ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ఆయన అన్నారు. కెనడా, న్యూజిలాండ్ దేశాలు తమ జట్లను పంపేందుకు నిరాకరిస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications