హైదరాబాద్: విశాఖపట్నం - కిరోండల్ ప్యాసెంజర్ రైలు గురువారం ఉదయం పట్టాలు తప్పింది. చత్తీస్ ఘడ్ లోని పచ్చేరి వద్ద ఈ రైలు పట్టాలు తప్పింది. పట్టాలు తొలగించి ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులే పట్టాలు తొలగించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రాణ నష్టమేదీ సంభవించలేదు. ఈ రైలు చత్తీస్ ఘడ్ లోని కిరోండల్ నుంచి అరకు మీదుగా విశాఖపట్నం వస్తుంది.
కిరోండల్ నుంచి విశాఖపట్నం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రైలుకు చెందిన ఇంజిన్, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక చర్యల కోసం రిలీఫ్ వ్యాన్ ను పంపించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.