అయోధ్యపై అలహాబాద్ హైకోర్టు తీర్పునకు సుప్రీంకోర్టు బ్రేక్

దేశం రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక కామన్ వెల్త్ క్రీడలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటుందని ఆయన త్రిపాఠీ తరఫున న్యాయవాది చెప్పారు. దాంతో పాటు బీహార్ ఎన్నికలను కూడా ఉటంకించారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఉగ్రవాదులు విదేశీ పర్యాటకులపై కాల్పులు జరిపిన నేపథ్యంలో అయోధ్య తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే కామన్ వెల్త్ క్రీడలకు వచ్చే విదేశీయులను, క్రీడాకారులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశాలుంటాయని, అతి సున్నితమైన అయోధ్య విషయంపై ఇలాంటి సందర్భంలో తీర్పు వస్తే దేశంలో అల్లరిమూకలు చెలరేగే అవకాశముందని భానిస్తున్నారు. అంతే కాకుండా రెండు వర్గాల వారిని మానసికంగా సిద్ధం చేయడానికి సైతం కేంద్రానికి సమయం ఉంటుంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వం కూడా తీర్పు వాయిదా వేయాలని కోరిని విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications