చిత్తూరు: క్షుద్రపూజల పేరుతో ఇద్దరిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు సరిహద్దులలో జరిగింది. మృతుల్లో ఒకరు మగవారు మరొకరు స్త్రీ ఉన్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా నగరి రైల్వే స్టేషను దగ్గరలో జరిగింది. రైల్వే స్టేషను వద్ద ఉన్న మృతుడి దగ్గర నిమ్మకాయలు, కుంకుమ, పసుపు తదితర మంత్రాలకు సంబంధించిన సామాగ్రి ఉంది. అయితే మృతురాని విషయమై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన వ్యక్తి తమిళనాడుకు చెందిన రైల్వే ఉద్యోగి.