విహెచ్ ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కామ్ లో వైయస్సార్ టార్గెట్ చేశారా?

V Hanumantha Rao
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కాంగ్రెసు సీనియర్ నాయకుడు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేశారా అనే అనుమానం కలుగుతోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కింగ్ మేకర్ అదృశ్య శక్తి ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. ఆ కింగ్ మేకర్ అదృశ్య శక్తి వైయస్సార్ అయి ఉంటారని భావిస్తున్నారు. ఆ అదృశ్యశక్తి బయటకు రావాలని ఆయన అన్నారు. పది వేల కోట్ల రూపాయల ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనేది వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాను యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీకి, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు, ముఖ్యమంత్రి రోశయ్యకు చెప్తానని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో వ్యక్తులను దాచి పెట్టడం ముఖ్యమంత్రికి మంచిది కాదని ఆయన అన్నారు.

రైతుల భూములను చాలా తక్కువ ధరకు ఎమ్మార్ ప్రాపర్టీస్ కు ఎపిఐఐసి సేకరించి ఇచ్చిందని, ఆ భూముల పక్కన వ్యక్తిగతంగా ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య వంటివారు భూములు కొనుక్కున్నారని, వీధులకు బిపి ఆచార్య పేర్లు పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో ఎపిఐఐసిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన అన్నారు. ఇంత అన్యాయం జరిగినా కూడా తాము నోరు విప్పకపోతే కాంగ్రెసుకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తమకు పైసా రాలేదు, తాము పైసా పెట్టలేదని, దీని వెనక కింగ్ మేకర్ ఉన్నారని శరత్ గుప్తా అనే వ్యక్తి తనకు చెప్పాడని విహెచ్ అన్నారు. రైతుల భూములు తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న నవీన్ మిట్టల్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+