హైదరాబాద్: హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో గల అత్తాపూర్ లో ఓ పాఠశాల బస్సు చిన్నారిని మింగేసింది. స్కూల్ బస్సు శనివారం ఉదయం ఢీకొట్టడంతో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అక్కడికక్కడే మరణించింది. ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో జాహ్నవి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.