నాకు ఉరి శిక్షి వేయండి: అయేషా కేసు నిందితుడు సత్యంబాబు
Districts
oi-Nageshwara Rao M
By Nageswara Rao
విజయవాడ: ఆయేషా హత్య కేసులో నిందితుడు సత్యంబాబు తనకు ఉరిశిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాడు. బుధవారం తుది విచారణ జరుగుతున్నది. తీర్పు మరో కొద్ది సేపటిలో వెలువడనుంది. విచారణ సందర్బంగా జడ్జి నీకు ఏ శిక్ష కావాలని సత్యంబాబుని అడిగితే నాకు ఉరి వేయండి. నా కుటుంబానికి నేనే ఆధారం. కాబట్టి నాకు యావజ్జీవం కన్నా ఉరి వేయండి. ఆ తరువాత నా కుటుంబానికి న్యాయం చేయండని కోరాడు. కాగా ఈ కేసులో మొదట బడా రాజకీయ నాయకుడి బంధువైన లడ్డును నిందితుడిగా పేర్కొనగా ఆ తరువాత సత్యంబాబు తెరపైకి వచ్చాడు. దీంతో పోలీసులు వ్యవహారంలో అనుమానాలు బలపడుతున్నాయి. కొందరు పెద్దవాళ్లు రక్షించడానికే పోలీసులు సత్యంబాబును ఇరికించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మృతురాలు తల్లి, మహిళా సంఘాలు కూడా సత్యంబాబు నిర్దోషిగా పేర్కొంటున్నారు.