వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని డిఎస్ పరోక్ష హెచ్చరిక

Srinivas
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పరోక్షంగా పార్టీ నాయకులను హెచ్చరించారు. జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుల సమావేశానంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల్లో తప్ప వేరే కార్యక్రమాల్లో పాల్గొనకూడదని డిఎస్ అన్నారు. అలా పాల్గొనేవారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనేవారిని ఉద్దేశించే ఆయన ఆ మాటలన్నారని అర్థమవుతోంది. పార్టీ నాయకులు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

పార్టీ నాయకుల మధ్య సమన్వయం కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునని, అయితే వాటిని పార్టీ వేదికల మీదనే వెల్లడించాలని, మీడియాకు ఎక్కి బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతితో దిగ్భ్రాంతికి గురై మరణించినవారి జాబితాను పార్టీ నాయకులకు అందించామని, ఆ జాబితాను సరి చూసి ధ్రువీకరించుకుని మరో జాబితాను జిల్లా నాయకులు ఇస్తారని, దాని ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు భూస్థాపితమైందని అనడం శాసనసభ్యురాలు కొండా సురేఖకు తగదని ఆయన అన్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో పలువురు సూచించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడు, మంత్రి దానం నాగేందర్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+