వైయస్ జగన్ వ్యూహం వల్లనే రెచ్చిపోతున్న కొండా సురేఖ

అధిష్టానం వైయస్ జగన్ ను ఇది విధంగా విస్మరిస్తే కాంగ్రెసు పార్టీకి 2014లో జరిగే ఎన్నికల్లో ఒక్క శాసనసభా సీటు కూడా రాదని, పార్లమెంటు సీటు కూడా రాదని ఆమె అన్నారు. తన మాటలు నిజమవుతాయని ఆమె అన్నారు. వైయస్ జగన్ సామర్థ్యాన్ని గుర్తిస్తేనే కాంగ్రెసుకు భవిష్యత్తు ఉంటుందని సురేఖ అన్నారు. రాష్ట్రంలో జగన్ కు అత్యున్నత పదవి ఇస్తే తప్ప లాభం లేదని ఆమె అన్నారు. ఆ అత్యున్నత పదవి ఏమిటనేది అందరికీ తెలిసిందే.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయన అనుచురులు కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆ విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. అయితే, జగన్ అనుచరులు అలా మాట్లాడడం వెనక ఓ వ్యూహం ఉందని భావిస్తున్నారు. అధిష్టానాన్ని రెచ్చగొట్టడమే వారి అభిమతంగా చెబుతున్నారు. కొంత మంది వ్యూహాత్మకంగానే పార్టీపై విమర్శలు చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అనడంలోని ఆంతర్యం బహుశా ఇదే అయి ఉంటుంది.












Click it and Unblock the Notifications