యెడ్యూరప్ప ప్రభుత్వానికి పొగ పెడుతున్న గాలి జనార్దన్ రెడ్డి

Gali Janardhan Reddy
బెంగళూరు: కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వానికి మళ్లీ ఎసరు వచ్చింది. ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రభుత్వానికి మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ పొగ పెట్టారు. బిజెపి అసమ్మతి శాసనసభ్యులు 26 మంది మంగళవారంనాడు బెంగళూర్ శివారులోని ఓ రిసార్టులో సమావేశమయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి వెనక ఉండి వారిని నడిపిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత వారు తమిళనాడు రాజధాని చెన్నైకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. వారిని బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి యెడ్యూరప్ప చర్యలు ప్రారంభించారు. వారి వద్దకు ఇద్దరు మంత్రులను మధ్యవర్తులుగా పంపించారు.

కాగా, అసమ్మతి సెగలు పెల్లుబుకుతున్న ప్రస్తుత నేపథ్యంలో యెడ్యూరప్ప బుధవారం మంత్రి వర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఆయన ఆదేశించారు. గాలి సోదరులతో పాటు ఆయన వర్గానికి చెందిన మంత్రులు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇటీవల యెడ్యూరప్ప మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టారు. కొంత మంది మంత్రులను తొలగించి తన మద్దతుదారులకు మంత్రి పదవులు ఇచ్చారు. అప్పటి నుంచి గాలి సోదరులు ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు సమాచారం.

గతంలో కూడా యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూల్చేందుకు గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో ఆయన శాసనసభ్యుల క్యాంప్ నిర్వహించారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించింది. గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్ కు యెడ్యూరప్ప దిగి వచ్చారు. దాంతో అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వెనక్కి తగ్గారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+