చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు ఎస్ఎస్ చంద్రన్ కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం. తిరువరూర్ జిల్లాలోని ముత్తుపేట సమీపంలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చినట్లు సమాచారం. ఎస్ఎస్ చంద్రన్ అన్నాడియంకె నాయకుడు కూడా. అన్నాడియంకె నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.