హైకోర్టు నిర్ణయం నేడే: ఢిల్లీకి మారుతున్న కర్ణాటక సీన్

కాగా, కర్ణాటక రాజకీయ నాటకం ఢిల్లీకి మారనుంది. ముఖ్యమంత్రి యెడ్యూరప్ప తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. గవర్నర్ భరద్వాజ్ తీరుపై ఢిల్లీలో ఫిర్యాదు చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అవసరమైతే రాష్ట్రపతి ఎదుట బలప్రదర్శన చేయాలనేది ఆయన ఉద్దేశం. యెడ్యూరప్ప ప్రభుత్వం నాటకీయంగా సోమవారం బలప్రదర్శనలో నెగ్గింది. అయితే, అది బూటకమని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని గవర్నర్ భరద్వాజ్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఆరోపించారు. కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యెడ్యూరప్ప తన పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నాయకులతో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications