నెలాఖరున ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గ విస్తరణ

Rayapati sambasiva Rao
న్యూడిల్లీ: న్యూఢిల్లీలో గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెలలోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మంత్రివర్గ విస్తరణపై నెలలోపు తీపి కబురు ఉంటుందని పరోక్షంగా చెప్పారు. కర్ణాటక రాజకీయాల కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లు చెప్పారు.

న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రోశయ్యతో రాయపాటి సమావేశమయ్యారు. రెండురోజుల క్రితం ఆయన రోశయ్యపై మంత్రి వర్గ విస్తరణ విషయంపై వివాస్పద వ్యాఖ్యలు చేసి దానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోశయ్య సోనియా భేటీ తరువాత మంత్రివర్గ విస్తరణ విషయం ఏమీ మాట్లాడలేదు. కాని రాయపాటి మాత్రం నెలరోజుల్లో తీపి కబురు ఉంటుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+