నాడు వైఎస్, నేడు రోశయ్య భూములు అమ్ముకుంటున్నారు: తెదేపా

మాజీ హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్, తాండూరు ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హుడా కార్యాలయానికి తరలి వచ్చారు. అధికారులు, ప్రభుత్వంనుండి ఎలాంటి స్పందన లేకపోవటంతో వారు కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే ఆప్రమత్తమై దేవేందర్ గౌడ్, మహేందర్ రెడ్డిలతో పాటు పలువురిని అరెస్టు చేసి నల్లకుంట పోలీసు స్టేషన్ కు తరలించారు.
దేవేందర్ గౌడ్, మహేందర్ రెడ్డి అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణపట్ల కెసిఆర్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కెసిఆర్ కు చిత్తశుద్ది ఉంటే ఈనెల 25న ఢిల్లీలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ ఇంటిముందు నిర్వహించే ధర్నాకు రావాలన్నారు. నాడు వైఎస్ హయాంలో, నేడు రోశయ్య హయాంలో భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications