గాలి జనార్దన్ రెడ్డిపై కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ కామెంట్

రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడంపై అడిగిన ప్రశ్నకు.. అది ఆ రోజు సభలో జరిగిన ప్రొసీడింగ్స్ ఆధారంగా ఇచ్చినదేనన్నారు. తన ప్రభుత్వం పట్ల గవర్నర్ వైఖరి సముచింగా లేదన్న యడ్యూరప్ప ఆరోపణలను ఆయన కొట్టిపారేస్తూ... "అప్పట్లో ముఖ్యమంత్రి కన్నీళ్లపర్యంతం అయ్యారు. ఆయనపై నాకు సానుభూతి ఉంది. చాలా అంశాల్లో ముఖ్యమంత్రికి నేను పూర్తి సహాయ సహకారాలు అందించాను'' అంటూ గాలి సోదరుల తిరుగుబాటును ప్రస్తావించారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికైన వారు ఎవరూ కర్ణాటకలో లేరని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్ ఏజెంట్‌ను అంటూ బీజేపీ చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం బీజేపీ తీవ్ర మానసిక వేదనలో ఉందని అన్నారు. "నా విధి కర్ణాటక ప్రజలకు సేవ చేయడం. అంతేకానీ.. రాజకీయ పార్టీలకు, కొందరు వ్యక్తులకు కాదు.'' అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications