వరంగల్ లో ఫర్నీచర్ ధ్వంసం చేసిన సిపిఐ

సిపిఐ కార్యకర్తలు కార్యాలయంలోనికి చొచ్చుకొని పోయి కార్యాలయంలోని కుర్చీలను, బల్లలను ధ్వంసం చేశారు. దీంతో కార్యాలయంలోని ఫర్నీచర్ అంతా విరిగిపోయింది. వెంటనే కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించటంతో వారు వచ్చి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు వారు సూక్ష్మ రుణ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చి సామాన్యులను బలితీసుకుంటున్నాయని, ఇలాంటి సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అని చెప్పి వారిని పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు. సూక్ష్మ రుణాల బాధలతో చనిపోయిన కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రుణ సంస్థలపై చర్యలు తీసుకోవడానికి మీన మేషాలు లెక్కిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications