రోశయ్య మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ వేసిన వైయస్ జగన్ ఫోబియా

సీనియర్ శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి, కె. జానారెడ్డి వంటివారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేక వర్గీయులకు స్థానం కల్పించారని ఓ వర్గం ఆగ్రహానికి గురి కావచ్చుననే అభిప్రాయం కూడా ఉంది. ఒకరిద్దరి కోసం మంత్రివర్గ విస్తరణ చేపట్టి కష్టాలు కొనితెచ్చుకోవడం ఎందుకనే భావన నెలకొని ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో పార్టీ ఆదేశాలను ధిక్కరించిన మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లపై చర్యలు తీసుకోకపోతే అలుసై పోయే ప్రమాదం ఉందని కూడా గుర్తించారు. అయినా సరే, కొంత కాలం అలా వదిలేయడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు చెబుతున్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా మంత్రివర్గ విస్తరణకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొయిలీ ఉన్నంత వరకు విస్తరణకు దూరంగానే ఉండాలని కూడా రోశయ్య అనుకుంటున్నట్లు తెలుస్తోది.












Click it and Unblock the Notifications