మైక్రో ఫైనాన్స్ లపై ఆర్డినెన్స్ కొరడా: గవర్నర్ కు పంపిన క్యాబినెట్
State
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్ : సూక్ష్మరుణ సమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చే ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సూక్ష్మరుణ ఆగడాలను అరికట్టేందుకు సచివాలయంలో మంత్రివర్గం గురువారం అత్యవసరంగా భేటీ అయింది. మైక్రోసంస్థల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో ఆర్డినెన్స్‌ను ఈ భేటీలో రూపొందించింది.వేధింపులకు పాల్పడే సూక్ష్మరుణ సంస్థల నిర్వహకులకు కనీసం మూడేళ్ల జైలు, రూ. లక్ష జరిమానా విధించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదం కోసం ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. గురువారం సాయంత్రం ఈ ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.