హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య పదవి చేపట్టగానే తెలంగాణ, సీమాంధ్ర వంటి సున్నిత సమస్యలు మళ్లీ బయటకు వచ్చాయని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ కావాలంటూ దొంగ నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావును ముందుగానే అరెస్టు చేసి అనవసరంగా ఆయన్ను హీరోను చేశారన్నారు. రోశయ్య హయాంలో రాష్ట్రం 7వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు.