బీహార్ లో నితీష్ కుమార్ దే మళ్లీ అధికారం: ఒపీనియన్ పోల్

Nitish Kumar
న్యూఢిల్లీ: బీహార్ లో ముఖ్యమంత్రి పీఠాన్ని జెడి(యు) నేత నితీష్ కుమార్ మరోసారి అధిష్టనున్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో జెడి(యు) - బిజెపి కూటమి మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని స్టార్ న్యూస్ - ఎసి నెల్సన్ ఒపీనియన్ పోల్ తేల్చింది. ఈ సంకీర్ణానికి 170 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్ర శాసనసభలో మొత్తం 243 సీట్లున్నాయి. ఆర్జెడీ - ఎల్జెపి కూటమి బలం 34 సీట్లకు తగ్గుతుందని సర్వే తేల్చింది. 2005 ఎన్నికల్లో 36.1 శాతం ఓట్లతో జెడి(యు) - బిజెపి కూటమి 143 సీట్లను గెలుచుకుందని, ప్రస్తుతం ఆ కూటమి ఓట్ల శాతం 41 శాతానికి పెరిగిందని, దాదాపు 5 శాతం ఓట్లు కూటమికి పెరుగుతున్నాయని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

దాదాపు 42 శాతం ప్రజలు నితీష్ కుమార్ సుపరిపాలనకు ఓటేస్తున్నారు. నితీష్ కుమార్ పాలన చాలా బాగుందని 31 శాతం మంది అభిప్రాయపడ్డారు. రోడ్లు, రవాణా వ్యవస్థ, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు చాలా మెరుగయ్యాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ అర్హుడని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా 16 శాతం మంది మాత్రమే బలపరిచారు. నితీష్ కుమార్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడగలరని 70 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.

బీహార్ లో కాంగ్రెసు పరిస్థితి కాస్తా మెరుగయ్యే అవకాశం ఉంది. బీహార్ లో కాంగ్రెసు 22 సీట్లు గెలుచుకుంటుందని ఒపినీయన్ పోల్ లో తేలింది. ఇది గతంలో కన్నా రెండింతలు. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెసుకు 9 సీట్లు మాత్రమే ఉన్నాయి. రాహుల్ గాంధీ ప్రచారం వల్ల బీహార్ లో ఓట్ల శాతం కాంగ్రెసుకు 6.1 శాతం నుంచి 10 శాతానికి పెరిగినట్లు అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+