ఆత్మహత్యల బాధ్యత చేతకాని రోశయ్య ప్రభుత్వానిదే: చంద్రబాబు నాయుడు

ప్రభుత్వం సూక్ష్మ రుణ సంస్ధల ఆగడాలను అరికట్టడంలో విఫలమయిందన్నారు. సూక్ష్మ రుణ సంస్థలు ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. వారి వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతులను సైతం ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదన్నారు. గిట్టుబాటు ధర లేక, ఎరువుల కల్తీ వల్ల రైతులు అప్పుల పాలయ్యి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారని వాపోయారు. రైతులను, ప్రజలను ఆదుకోని చేతకాని ప్రభుత్వాన్ని ప్రజలను కోరుకోవటం లేదన్నారు.












Click it and Unblock the Notifications