తెలంగాణపై మా ఢిల్లీ యాత్రకు చంద్రబాబు మద్దతు: నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము చేస్తున్న ఢిల్లీ యాత్రకు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతు ఉందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. ఈ నెల 25వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి ఢిల్లీ బయలుదేరే ముందు శనివారం తెలుగుదేశం నాయకులు తెలంగాణ ప్రాంత నాయకులు గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగం జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శీతాకాలం సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని తాము ఒత్తిడి తెస్తామని, ఇందుకు తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీల మద్దతును ఢిల్లీలో కూడగడుతామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశం తేలాల్సింది ఢిల్లీలోనే అని, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వమే గందరగోళం సృష్టిస్తోందని, అందుకే తాము ఢిల్లీ యాత్రను తలపెట్టామని ఆయన అన్నారు.

కాగా, తెలుగుదేశం నాయకుడు దేవేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను కొంత మంది వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామిక వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆయన అన్నారు. తాము నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అంశాన్ని రాజకీయ క్రీడగా మార్చేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ అంశం కీలకమైన దశకు చేరుకుందని, ఎవరేమన్నా తమ ఢిల్లీ యాత్ర తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తమతో అన్ని పార్టీలు, సంఘాలు కలిసి రావాలని ఆయన కోరారు.

అయితే, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ప్రత్యేకమైన జండాలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ చిత్ర పటం ముద్రించిన పచ్చ జెండాలను వారు ప్రదర్శించారు. ఆ జెండాపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు బొమ్మ గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బొమ్మ గానీ లేదు. వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+