హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ వద్ద విజయవాడ హైవేపై రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు నిరసనగా రాస్తారోకో చేస్తున్న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కోదండరామ్ ను పోలీసులు నిర్దాక్షిణ్యంగా జీపులో తోసేశారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయనతో పాటు ధర్నాలో పాల్గొన్నవిద్యార్థులు రెచ్చిపోయారు. పోలీసులకు తెలంగాణవాదులకు మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు తాము ఉద్దేశ్యపూర్వకంగా కోదండరాంను జీపులో తోసి వేయలేదని చెప్పారు. అంతకుముందు తెలంగాణవాదులు రహదారిపై ధర్నా నిర్వహించారు. రహదారిపై టైర్లు కాల్చారు. దీంతో సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
రంగారెడ్డి జిల్లా లాయర్లు అవతరణ దినోత్సవాలకు నిరసనగా జిల్లా కోర్టు వద్ద ధర్నా చేశారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆంధ్ర నాయకుల పెత్తనంలో తెలంగాణ వెనుకబడిందన్నారు.