వైయస్ జగన్ వర్గాన్ని దూరం పెట్టేందుకే కమిటీ ఏర్పాటు నిలిపివేత?

పైకి కనిపిస్తున్న కారణాలు అవే అయినా యూత్ కాంగ్రెసు వ్యవహారాలు చూస్తున్న రాహుల్ గాంధీ ప్రమేయంతోనే వాటిపై స్టే విధించినట్లు అనుమానిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షుల నియామకాన్ని నిలిపేసినట్లు యూత్ కాంగ్రెసు జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ శర్మ, అధ్యక్షుడు రాజీవ్ సాతో చెప్పారు. పూర్తి సమాచారం తీసుకుని దీపావళి తర్వాత నియామకాలు చేపడుతామని వారు చెప్పారు. సుధాకర్ బాబు అధ్యక్షుడిగా ఉంటారని వారు చెప్పారు. పార్టీ కోసం పనిచేసేవారిని విస్మరించబోమని వారు స్పష్టం చేశారు. అయితే, వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నవారిని, జగన్ కు సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి వారిని కమిటీలకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
వైయస్ జగన్ అనుచరులు ఉన్నారు కాబట్టే రాష్ట్రంలోని యూత్ కాంగ్రెసు కమిటీలను రద్దు చేశారని గతంలో వైయస్ జగన్ అనుచరుడు అంబటి రాంబాబు విమర్శించారు. అటువంటి స్థితిలో మళ్లీ వైయస్ జగన్ కు చెందినవారినే నియమించడంలో అర్థం లేదని రాహుల్ గాంధీ భావించినట్లు సమాచారం. కమిటీపై స్టే విధించినట్లు చెబుతున్నప్పటికీ దాన్ని రద్దు చేసినట్లేనని భావిస్తున్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ సారథిగా టి.జె.ఆర్.సుధాకర్‌బాబును కొనసాగిస్తూ యువజన కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 38 మందితో పాటు 23 జిల్లాల అధ్యక్షులు, 13 మంది నగర అధ్యక్షుల పేర్లను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి జ్యోతిమణి న్యూఢిల్లీలో మంగళవారం ప్రకటించారు. పలు జిల్లాల్లో జగన్ వర్గానికి చెందినవారికే పట్టం కట్టినట్లు వార్తలు వచ్చాయి.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications