ఉస్మానియాలో మరో వివాదం: నరకాసురుడు కూడా దేవుడే

Osmania University
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరో వివాదం ముందుకు వచ్చింది. నరకాసురుడిని రాక్షసుడిగా అభివర్ణిస్తూ, అతని వధకు సంతోషంగా దీపావళి పండుగ జరుపుకోవడాన్ని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దళిత విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలంయ ఆర్ట్స్ కళాశాల వద్ద నరకాసురుడిని దేవుడి రూపంలో ప్రతిష్ఠించారు. అబద్ధపు ఆరోపణలు చేసి నరకాసురుడిని చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. వారికి దళిత మేధావి, నేను హిందువునెట్లయిత పుస్తక రచయిత కంచ ఐలయ్య మద్దతుగా నిలిచారు.

దీపావళి పండుగను రాష్ట్రంలో ఎవరూ జరుపుకోవద్దని కంచ ఐలయ్య ప్రజలను కోరారు. బ్రాహ్మణ వ్యవస్థ నరకాసురుడిని రాక్షసుడిగా చూపిందని ఆయన విమర్శించారు. తమ వాదనకు క్రమంగా బలం చేకూరుతుందని ఆయన అన్నారు. బౌద్ధం బుద్ధుడి ఐదుగురు శిష్యులతో, క్రైస్తవం క్రీస్తు 12 మంది శిష్యులతో, ఇస్లాం మహ్మద్ ప్రవక్త తన భార్యను మార్చుకోవడంతో ప్రారంభమయ్యయని, తమ వాదన కూడా ముందు ముందు బలం పుంజుకుంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+