సోనియాపై దుమ్మెత్తిపోసిన వైయస్ జగన్ వర్గం: అమీతుమీకే రెడీ

మరోవైపు అంబటి రాంబాబు ఏఐసీసీపై విమర్శనా బాణాలు సంధించారు. వైఎస్సార్ పేరును ప్రస్తావించకుండా ఏఐసీసీ తప్పు చేసిందనీ, తద్వారా రాష్ట్ర ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఏఐసీసీ సమావేశాల్లో వైఎస్సార్‌కు నివాళులర్పిస్తారని ప్రజలు ఎదురు చూశారనీ, ఆ కార్యక్రమం లేకపోవడంతో మండిపడుతున్నారన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని విస్మరిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2003నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్నారు. అయితే ఏఐసీసీ సమావేశాల్లో సంతాప తీర్మానాలు ఉండవనీ, కేవలం సీడబ్ల్యూసీ ఎన్నిక మాత్రమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని సీనియర్ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన వైఎస్సార్‌ను పార్టీ ఎట్టి పరిస్థితిల్లోనూ విస్మరించదనీ, వచ్చే డిసెంబరు ప్లీనరీ సమావేశాల్లో వైఎస్సార్ సంతాప కార్యక్రమం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications