గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ పని గోవిందా?

బ్రాహ్మణి స్టీల్స్ లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కూడా వాటాలున్నాయని అంటారు. అయితే, ఇటీవల గాలి జనార్దన్ రెడ్డికి అన్ని వైపుల నుంచి కష్టాలు ఎదురు కావడంతో బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణం ఆగిపోయేట్లుందని అంటున్నారు. బ్రాహ్మణి స్టీల్స్ లో 51 శాతం వాటాలను అమ్మకానికి పెట్టారని, అయితే దానికి సరైన ప్రతిస్పందన లభించలేదని అంటున్నారు. అలాగే, గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల ఇళ్లపై ఐటి దాడులు కూడా ప్రభావం చూపినట్లు సమాచారం. గనుల తవ్వకాలపై కూడా ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఈ స్థితిలో బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణం డోలాయమానంలో పడిందనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications