ముఖ్యమంత్రి రోశయ్యపై ధ్వజమెత్తిన టిడిపి అధినేత చంద్రబాబు

Chandrababu Naidu
కాకినాడ: వరద సహాయక చర్యల విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కె. రోశయ్య మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా వరద తాకిడి ప్రాంతాల పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ఉదయం కాకినాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే వల్ల బాధితులకు ఒరిగేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు వరద తాకిడి ప్రాంతాల్లో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిన అవసరం లేదా అని ఆయన అడిగారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి వరద సహాయక చర్యలకు నిధులు రాబట్టడంలో రాష్టానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు విఫలమయ్యారని ఆయన అన్నారు. 33 మంది కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఉన్నా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన తమ పార్టీ శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేయడం అనాగరికమని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిన అవసరం లేదా అని ఆయన అడిగారు. బియ్యం ఇవ్వాలంటే అన్నసత్రం కాదని ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యానించడం పేదలను వెక్కిరించడమేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+