చిరంజీవికి వైయస్ జగన్ గండం: పార్టీలో లుకలుకలు

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ రూపంలో ముప్పు వాటిల్లుతోంది. ఆయన జగన్ నుంచి తీవ్ర సమస్యను ఎదుర్కుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీలో నిస్సత్తువ ఆవహించి, క్రియాశూన్యంగా మారిపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు వైయస్ జగన్ వైపు చూస్తున్నారు. సినిమాలో నటించాలని నిర్ణయం తీసుకున్న చిరంజీవికి రాజకీయాలు పార్ట్ టైమ్ గా కూడా మారాయి. దీంతో పార్టీని చక్కదిద్దే పనిని ఆయన పూర్తిగా వదిలేశారు. పార్టీలో ఏం జురగుతోందో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఈ స్థితిలో వైయస్ జగన్ వైపు జిల్లాల్లోని నాయకులు, కార్యకర్తలు చూస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా మహిళారాజ్యం మాజీ అధ్యక్షురాలు శోభా రాణి పార్టీ క్రమశిక్షణా సంఘానికి రాసిన లేఖలో తెలిపారు.

వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న నాయకులపై పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని శోభారాణి విమర్శించారు. నెల్లూరు జిల్లాలో యువరాజ్యం అధ్యక్షుడితో పాటు కార్యకర్తలందరూ జగన్ వైపు వెళ్లిపోయినట్లు సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన శాసనసభ్యురాలు శోభానాగి రెడ్డి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి మొదటి నుంచీ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకునే సాహసం చిరంజీవి చేయడం లేదు. కోటగిరి విద్యాధర రావు నేతృత్వంలోని క్రమశిక్షణా సంఘం అసలు పని చేయడం లేదని అంటున్నారు. పార్టీలో ఎప్పటికప్పుడు శోభారాణి వంటి వారు చిచ్చు పెడుతూనే ఉన్నారు. అయినా కూడా చిరంజీవిలో కదలికలు లేవు. పార్టీ నాయకత్వం తీసుకున్న అల్లు అరవింద్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+