ముంబైలో సతీ సమేతంగా కాలు మోపిన బరాక్ ఒబామా

ఓబామా మధ్యాహ్నం 3 గంటలు 20 నిమిషాలకు మణిభవన్ వెళ్తారు. ఆ తర్వాత నాలుగున్నర గంటలకు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఐదున్నర గంటలకు బిజినెస్ కౌన్సిల్ మీట్ లో పాల్గొంటారు. ఒబామా రాక సందర్భంగా ముంబైలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు జెట్ విమానాలు పహారా కాస్తుంటాయి. ముంబై తీరం వెంబడి 34 యుద్ధ నౌకలను మోహరించారు. ముంబై పర్యటన తర్వాత ఆయన ఢిల్లీ బయలు దేరి వెళ్తారు. ఈ నెల 8వ తేదీన పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications