తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: తుఫాను తాకిడికి గురయ్యే తీర ప్రాంతాల ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య నాలుగు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను ముప్పుపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను వల్ల ఆదివారం ఉదయం నుంచి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడడం ప్రారంభమవుతాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఆదివారం సాయంత్రం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుందని, రాత్రి వేళ అది తీరం దాటే అవకాశం ఉందని, అందువల్ల ఆదివారం ఉదయం నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించామని ఆయన అన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించి ఆ పాఠశాల భవనాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కలిగించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+