మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్

అశోక్ చవాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త నేత ఎన్నిక కోసం కాంగ్రెసు శాసనసభ్యులు మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎఐసిసి ప్రతినిధులుగా ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ హాజరయ్యారు. దాదాపు గంట పాటు సాగిన సమావేశం తమ నేత ఎంపిక నిర్ణయాధికారాన్ని సోనియాకు అప్పగించింది. ఆదర్శ్ స్కామ్ పై ప్రజల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రిని మార్చక తప్పడం లేదని ప్రణబ్ ముఖర్జీ శాసనసభ్యులకు చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు విస్మరించలేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications