తెలంగాణ కోసం కెసిఆర్ ఏమైనా చేస్తానన్నాడు: కాంగ్రెసు నేత కేశవరావు

K Keshav Rao
హైదరాబాద్: తెలంగాణ కోసం తాను ఏమైనా చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నట్లు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు. కెసిఆర్ తో తన భేటీపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ తనతో తెలంగాణ గురించే మాట్లాడారని, తామిద్దరం తెలంగాణ సాధించడం గురించే మాట్లాడుకున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై తాము రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. తెలంగాణ వాదాన్ని ముందుకు తెచ్చింది తామేనని ఆయన చెప్పారు. తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామే కాబట్టి కెసిఆర్ తనను కలిశారని ఆయన చెప్పారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులను కూడా కలుపుకుని పోతామని ఆయన చెప్పారు. తెలంగాణవాదులంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

తాము అధికారంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ సాధన కోసం కెసిఆర్ తనను కలిశారని, తెలంగాణ కోసం ఏమైనా చేస్తానని అన్నారని, తెలంగాణ కోసం కాంగ్రెసును బలపరుస్తానని చెప్పారని ఆయన వివరించారు. తెలంగాణ సాధన శాంతియుతంగా జరగాలనేది తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. తాము ప్రత్యేకంగా పిసిసి పెట్టుకుంటామని దివంగత నేత వైయస్సార్ అడ్డుకున్నారని ఆయన చెప్పారు. తాము రాష్టాన్ని విడదీసి, ప్రజలను కలిపి ఉంచాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల సమావేశానికి వెళ్లారనే ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం కెసిఆర్ తో మంతనాలు జరిపినట్లు వచ్చిన వార్తల్లో కూడా ఏ మాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడం లేదని, తాను ముఖ్యమంత్రిని అవుతానని కూడా అనుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజా ఉద్యమం జరుగుతోందని, దానిపై తప్పుడు వార్తలు రాయవద్దని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+