కాంగ్రెసు సభకు జగన్ వర్గం కొండా దంపతులు గైర్హాజరు

ఓ శిలాపలకంపై తన పేరు లేనందున రోశయ్యపై, ప్రభుత్వంపై కొండా మురళీ ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహనరెడ్డిని తాము అభిమానిస్తున్నందువల్లనే తమను ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం పక్కన పెడుతోందని అయన అన్నారు. రోశయ్య నామినేటెడ్ శాసనమండలి సభ్యుడు అయితే నేను ఎన్నికయిన సభ్యుడినన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురయినా జగన్ వెన్నంటే ఉంటామని, తన పేరు శిలాపలకం లేకపోవటం వైయస్ అభిమానులకు జరిగిన అవమానంగానే భావిస్తున్నామన్నారు. మా నియోజకవర్గానికి కావాలనే ముఖ్యమంత్రి నిధులు ఇవ్వడం లేదన్నారు. మాజీ మంత్రి దామోదర రెడ్డి వైయస్ దయవల్లనే ఇంతటి వాడయ్యాడన్నారు.












Click it and Unblock the Notifications