నథింగ్ స్పెషల్, సోనియా గాంధీతో భేటీ లేదు: చిరంజీవి

కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై చర్యలకు పూనుకుంటోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరంజీవి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం చేకూరిందని రాజకీయ వర్గాలంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజారాజ్యం పార్టీని చేర్చుకునేందుకు చిరంజీవితో కాంగ్రెసు అధిష్టానం మాట్లాడుతుందని అంటున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో ఉంటున్న నేపథ్యంలో చిరంజీవి ఢిల్లీ వెళ్తున్నారు. దీంతో చిరంజీవిని కూడా మార్పులు చేర్పుల్లో భాగస్వామిని చేసేందుకు కాంగ్రెసు అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications