మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోడేరు మండలంలోని సింగాయపల్లి గ్రామం పరిధిలో ఉన్న గుండ్యానాయక్ తండాలో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం పాఠశాలనుండి వచ్చిన తర్వాత వారు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. అయితే 3.30 గంటల ప్రాంతంలో ఆ దారిన వెళుతున్న ఓ వ్యక్తి గట్టుమీద ఐదుగురు విద్యార్థుల బట్టలు ఉన్నట్టు గమనించారు. కాని విద్యార్థులు కనిపించక పోవటంతో ఆయన గ్రామస్థులకు సమాచారాన్ని అందించారు. కాగా గ్రామస్తులు మృతదేహాల కోసం గాలిస్తున్నారు.