బొత్స సత్యనారాయణకు పిసిసి సారథ్య బాధ్యతల అప్పగింత?

బొత్స సత్యనారాయణ ఎంపీగా రెండు పర్యాయాలు ఓటమి చవిచూసినా, మూడోసారి ఎంపీ పదవికి పోటీ చేసి గెలుపొందారు. 2004లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బొత్స వైఎస్ కేబినెట్‌లో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పదవిని చేపట్టారు. ఈ కాలంలోనే వోక్స్‌వ్యాగన్ కుంభకోణం మచ్చపడడంతో మార్కెటింగ్ శాఖకు మారారు.
2007లో గృహనిర్మాణ శాఖ చేపట్టారు. 2009 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచే రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, కీలకమైన పంచాయతీరాజ్ శాఖను దక్కించుకోగలిగారు. వైఎస్ మరణానంతరం యాదృచ్ఛికమే అయినా సత్తిబాబు మార్కు రాజకీయాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. తెలంగాణ వెనుకబాటును గుర్తు చేసిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా అందరి నోళ్లలో నానారు. తెలంగాణకు అనుకూలమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. తరువాత ఉత్తరాంధ్ర వెనుకబాటును గుర్తు చేస్తూ శ్రీకృష్ణ కమిటీకి వ్యక్తిగత నివేదికను ఇవ్వడం ద్వారా అందరిదృష్టిని ఆకర్షించారు.












Click it and Unblock the Notifications