రేపు ఢిల్లీకి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రివర్గం ఏర్పాటు ఎల్లుండి?

అక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతారు. ఆసెంబ్లీ కమిటీ హాల్ 1లో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సాయంత్రం 6 గంటలకు కలుస్తారు. ముఖ్యమంత్రి శుక్రవారం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అవుతారు. కేబినెట్ విషయమై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఆయన హైదరాబాదుకు రేపే తిరిగి వస్తారు. కాగా ఎల్లుండి మంత్రివర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications